November 8, 2024

Tsdreams

INDIAN NEWS NETWORK

ఉచితంగా మందులు, ఆహారం – ఈ నెంబర్‌ల‌కు ఫోన్ చేస్తే చాలు

1 min read

హైద‌రాబాద్ (ts dreams network): ప్ర‌స్తుతం ఉన్న విప‌త్కార స‌మ‌యంలో అక్క‌డ‌క్క‌డ మాన‌వ‌త్వం ప‌రిమ‌ళిస్తోంది. కరోనా వైరస్ బారిన పడ్డవారిని ఆదుకునేందుకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. కొందరు ఫ్రీగా ఫుడ్ అందజేస్తుంటే.. మరికొందరు మెడిసిన్ ఇంటివద్దకే తీసుకొని వచ్చి ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు అందజేసేందుకు సహజ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కరోనా పాజిటివ్‌గా తేలి.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు డాక్టర్లు సూచించిన మందులు కావాల్సి వస్తే.. ఆ చీటితో 9177000083 నంబరుకు ఫోన్‌ చేయాలని ఫౌండేషన్ సభ్యులు సూచించారు. ఇలా చేసిన వెంటనే పదిరోజులకు సరిపడా మందులను కరోనా రోగుల ఇంటివద్దకే తీసుకొచ్చి అందజేస్తామని సహజ ఫౌండేషన్ నిర్వాహకురాలు శైలజ తెలిపారు.

మ‌రోవైపు కరోనా పేషెంట్స్ కు ఉచితంగా ఆహారం వండి పంపిస్తున్నారు హైద‌రాబాద్‌కు చెందిన‌ నిహారిక రెడ్డి. యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా 9701821089 నెంబర్ కి ఒక రోజు ముందుగా కాల్ చేసి మీ లొకేషన్ షేర్ చేస్తే, హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ వారి ఇంటి దగ్గరకు డెలివరీ చేస్తున్నారు. ఏదీఏమైనా క‌ష్ట‌కాలంలో అక్క‌డ‌క్క‌డ‌ మాన‌వ‌త్వం ప‌రిమళిస్తోంది.

for medicines – https://www.facebook.com/sailaja.vissamsetti
for food – https://www.facebook.com/niharika.palyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.