మేడ్చల్: జోరుమీదున్న కాంగ్రెస్, చేరికలు షురూ
1 min read
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని టీ-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కోరిన టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జోరు మీదున్నది. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నమ్మి మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన అనేకమంది కీలకనాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ టీ-పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డిని తోటకూర వజ్రేష్ యాదవ్ ఆహ్వానించారు. మర్యాద పూర్వకంగారేవంత్‌ను కలిసిన తోటకూర వజ్రేష్ యాదవ్ పార్టీలో చేరికలపై చర్చించారు.
ఈ సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం బి-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్, హైదరాబాద్ జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వరలక్ష్మి,సీనియర్ నాయుకులు వెంకటేష్ గుప్త,పోగుల వీరారెడ్డి, కుర్రి శంకర్,తోటకూర మల్లేష్ యాదవ్, జ్ఞానేశ్వర్, బీరప్ప, తదితరులు పాల్గొన్నారు.