April 14, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

హజ్ యాత్రికుల కోసం మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫ్రీ హెల్త్ క్యాంప్

హైదరాబాద్ : హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్‌ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్ ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హజ్ యాత్రికులకు జనరల్ హెల్త్ చెకప్‌తో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒబేదుల్లా కొత్వాల్ కరోనా కాలంలో కూడా మినా ఆస్పత్రి విశేష సేవలు అందించిందని తెలిపారు. మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మినా ఆస్పత్రి మంచి పేరు సంపాదించిందన్నారు. హజ్ యాత్రికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్లు అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

మినా ఆస్పత్రి ఆధునిక సదుపాయాలతో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, మేటర్నిటీ, ఎమర్జెన్సీ, ట్రామా కేర్, ఐసీయూ వంటి విభాగాల్లో సమర్థవంతమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఆస్పత్రి ఛైర్మన్ హైదయతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో రోగులకు అందుబాటు ఖర్చుతో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆప్తాల్మాలజీ (ఐ కేర్) విభాగంలో డాక్టర్ హిదయతుల్లా ఖాన్, డాక్టర్ బాసిత్ హుస్సేన్, గైనకాలజీ విభాగంలో డాక్టర్ సోహెబా షుకూర్, జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ జవాద్ విశేష సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మినా ఆస్పత్రి ఛైర్మన్ హైదయతుల్లా ఖాన్, డైరెక్టర్ షోయబా షుకూర్ తదితరులు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ కోసం ఆసక్తి గల హజ్ యాత్రికులు 040-35262700, 040-35262701, 7396084445, 7396084446 నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. క్యాంప్‌కు హాజరయ్యే రిజిస్టర్డ్ యాత్రికులకు భోజన సదుపాయం కూడా కల్పించినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.