November 17, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

జర్నలిస్ట్ రఘుది కిడ్నాపా? అరెస్టా?

జర్నలిస్టు రఘుది కిడ్నాపా? అరెస్టా? అవును ఎక్కడ చూసిన ఇప్పుడు హాట్ టాఫిక్ గా చర్చ నడుస్తొంది. ఓ జర్నలిస్టును కిడ్నాపర్స్ మాదిరిగా కారులో తరలించడం ఆపై అరెస్టు చేశామంటూ పోలీసులు చెప్పడంపై జర్నలిస్టు సంఘాలతోపాటు ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాయి. జర్నలిస్టు రఘు కిడ్నాప్ అరెస్టుకు కారణం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు రఘును అరెస్ట్ చేసిన తీరును కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు.

ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లిన ఆయనను.. మఫ్టీలో వచ్చిన పోలీసులు మల్కాజిగిరిలో అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ట్వీట్ చేసిన దాసోజు శ్రవణ్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు.

‘దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా? వీళ్లు పోలీసులా లేక గులాబీ గూండాలా? ఇదేం రాజ్యం? ఒక జర్నలిస్ట్‌పై ఇంత దారుణం ఎందుకు? నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా? నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే తెలంగాణ డీజీపీ గారు.. ఈ పోలీసులపై మీరు ఏంచర్య తీసుకుంటారు?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.