November 21, 2024

Tsdreams

INDIAN NEWS NETWORK

Kaveti Law Firm: విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫర్మ్ ప్రారంభం 

విజ‌య‌వాడ‌: విదేశాల‌కు వెళ్లే భార‌తీయుల‌కు న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు, సేవ‌లు అందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా గల కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ భార‌త్‌లో తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్ సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో విజయవాడలోని బందరు రోడ్డులో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని, అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు డా. విక్ గాఫ్నీ,చెన్నుపాటి శ్రీనివాస్, ఎఫ్‌సీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర, తెలంగాణా హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు, బి. ప్రసాదరావు, చెన్నుపాటి శుభాకర్, బొమ్మిన కళ్యాణి తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఇటీవల సుప్రీం కోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీసు చేసుకోవచ్చు అని నిర్ణయించినందువలన, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని, హైదరాబాద్ లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు కావేటి శ్రీనివాస్ తెలిపారు.

ఏప్రిల్ 28వ తేదీన గుంటూరులోను, 29 న తిరుపతిలోను కూడా తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్ సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్ తెలిపారు.

తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని కావేటి లా ఇండియన్ ఆపరేషన్స్ అధిపతి, అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు డా. విక్ గాఫ్నీ తెలిపారు.

విదేశాలకు వెళ్లేముందు, విదేశాలకు వెళ్లాలనుకునేవారికి, ఆయా దేశాల్లో ప్రవేశించాక, అక్కడ ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా, ఎలా నడుచుకోవాలో ప్రతినెలా, ఒక రోజు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.